telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మీరు చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా ?

బండి సంజయ్ తీరు సరిగ్గా లేదని..చరిత్ర గల నాయకులపై నిందలు వేయడం బాధాకరమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మాట్లాడేటప్పుడు తెలుసుకుని మాట్లాడాలి.. ఉద్యమ సమయంలో బండి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఉద్యోగులుగా ఉండి తెలంగాణ కోసం ప్రాణం పోయినా సరే అన్నట్లుగా పోరాడాము.. అదృష్టంతో అధ్యక్షుడుగా అయ్యావు.. నిలుపుకో అని హెచ్చరించారు. తెలంగాణలో మీరు సహకరించక పోయినా.. కేంద్రంలో మీ అవసరం ఉంటుంది అని ఆలోచించామన్నారు. బిజెపి నాయకులు తెలంగాణ కోసం జైలుకు పోయారా… రాజీనామా చేశారా..? అని నిలదీశారు. బీజేపీని దిగజార్చి మేం విమర్శించలేదు..ఎవడో పేపర్ పంపితే చూసి చదువుతారా అని ఫైర్ అయ్యారు. చెమట రక్తంతో మేం భూమి కొన్నాం..ఎన్ఓసి తీసుకొని భూమి కొన్నామన్నారు. మీరు చేస్తే సంసారం.. మెం చేస్తే వ్యభిచారమా.. అని ఫైర్ అయ్యారు. బండి బిసి నాయకుడా.. ఇష్టారాజ్యంగా మాటాడుతున్నారు.. నేను ఇల్లు కట్టుకుంటే ఇంత మంటా ? డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ నుంచి అనుమతి చేసుకున్నామని పేర్కొన్నారు. ఐదు ఎకరాల 34 గుంటల కంటే గజం ఎక్కువ ఉంటే.. మొత్తం ఇచ్చేస్తా అని పేర్కొన్నారు. పాస్ బుక్ లో ఉన్నదాని కంటే.. ఒక్క గజం ఎక్కువ ఉన్నా.. ఆస్తి మొత్తం దానం చేస్తానన్నారు. బండి సంజయ్ నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే, అన్ని పదవులకు రాజీనామా చేస్తా.. నిరూపించక పోతే బండి సంజయ్ రాజీనామా చేస్తారా ? అని సవాల్ విసిరారు.

Related posts