telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబు గురువు..కేఏ పాల్ శిష్యుడు

vijayasaireddy ycp

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. అయితే తాజాగా  టిడిపి అధినేత చంద్రబాబు, కేఏ పాల్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ వేశారు. చంద్రబాబు శిష్యుడు కేఏ పాల్ గురువును మించిన డ్రామాలాడుతున్నాడని చురకలు అంటించారు. “చంద్రబాబు శిష్యుడు కేఏ పాల్ గురువును మించిన డ్రామాలాడుతున్నాడు. కరోనా సమయంలో దీక్షలు చెయ్యాలని గురువు చంద్రబాబే అతన్ని పురమాయించాడా? సందట్లో సడేమియా అంటూ లోకేశంకు పోటీగా బయల్దేరాడు. అద్దె మైకు కదా నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. కోవిడ్ కష్టకాలంలో ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు హాస్పిటళ్లలో చాలా వరకు చంద్రబాబు సన్నిహితులవే. ప్రభుత్వం తనిఖీలు చేస్తుంటే మూసి వేస్తామని బెదిరిస్తున్న ఈ హాస్పిటళ్ల యజమానులకు నచ్చజెప్పే బాధ్యతను బాబు తీసుకోవాలి. ఎక్కడో కూర్చుని తమాషా చూడటం కాదు.” అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ఇక అంతకు ముందు ట్వీట్ లో “వ్యూహ రచనలో చాణక్యుడు అంతటి వాడినని భ్రమపడుతుంటాడు చంద్రబాబు. అందుకే ఏ పనికి ఏ ‘పార్టీ’ వాళ్లను వాడాలో వారిని ప్రయోగిస్తాడు. ఫిర్యాదులు, దీక్షలు చేయిస్తాడు. దీని వల్ల ఒరిగేది ఏమీ ఉండదని అర్థం చేసుకునే లోపు సొంత మనుషులే ‘పార్టీ లేదు బొక్కా లేదు’ అని గోచీ పీకి వెళ్లిపోతారు.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Related posts