telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇండియాలో కరోనా కల్లోలం : 3.68 లక్షల కేసులు…3417 మరణాలు

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.99 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 3,68,147 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 3,417 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,00,732 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,99,25,604 కాగా.. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 34,13,642 గా ఉన్నాయి. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 2,18,959 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 85.6 శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 13.26 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.18శాతానికి మరణాల రేటు తగ్గింది.

Related posts