telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మార్కెట్ లోకి వచ్చిన ‘Mi 10i’ 5జీ ఫోన్…

ఎంఐ 10ఐ పేరులో ‘ఐ’ అంటే ఇండియా అని, ఈ ఫోన్‌ను భారతీయ యూజర్లకు కావాల్సినట్టుగా తీర్చిదిద్దామని షావోమీ ఇండియా ప్రకటిస్తూ కొత్త ఫోన్ రిలీజ్ చేసింది. ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉండటం విశేషం. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. షియోమీ ఎంఐ 10 సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఎంఐ 10టీ, ఎంఐ 10 టీ ప్రో,  ఎంఐ 10 5జీ మోడళ్లను విడుదల చేసింది. ఎంఐ 10 ప్రారంభ ధర రూ.20,999గా నిర్ణయించారు. ఐసీఐసీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 2వేల ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభించనుంది. 10వేల విలువైన రిలయన్స్‌ జియో ప్రయోజనాలను పొందొచ్చు. ఎంఐ 10ఐ  మూడు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .20,999, కాగా  6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ .21,999గా ఉండగా 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .23,999గా నిర్ణయించారు. డిస్‌ప్లే:6.67 అంగుళాలు, ప్రాసెసర్‌:క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 750జీ, ఫ్రంట్‌ కెమెరా:16 మెగా పిక్సెల్‌, రియర్‌ కెమెరా: 108+8+2+2 మెగా పిక్సెల్‌ కాగా ఈ ఫోన్ బరువు కేవలం 214.5 గ్రాములు మాత్రమే కావడం విశేషం. మరి మీకు నచ్చితే తీసుకోండి.

Related posts