telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

వారికీ కూడా రిజర్వేషన్ అమలు… నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

Kcr telangana cm

కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రిజర్వేషన్స్ లో చాలా మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం శ్రీ కేసీఆర్ వెల్లడించారు. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఇడబ్ల్యుఎస్ తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts