ఆకాశపు వెలుగులు
పక్షులు పలకరింతలు
పువ్వుల పరిమళాలు
చిరుగాలి స్వాగతాలు
అలల స్పర్శలు ఇవి ఏవి
హాయిని ఆనందాన్ని
మనసుకు తృప్తిని ఇవ్వడం లేదు..
నీకై నా ఎదురుచూపులకు
కాలం పడిగాపులు కాయిస్తున్నా
మౌనం వెనుక అంతర్మథనంలో
అంతులేని ఆలోచనలు
నన్నేదో అసంతృప్తి కి బీజం వేయాలని చూస్తున్న
చెక్కు చెదరనీయని నీపై నా ఆత్మవిశ్వాసం
నీ ప్రేమ నాప్రేమ మన ప్రణయ శుభ ఘడియలు
“నిరీక్షణ “లోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను…
కలయిక కారణాల నెమరువేతలో
మనసు మయూరమల్లే పురివిప్పి వుంది..
నీరాకతో తన్మయమై ఆనందనాట్యమే చేస్తుంది….
రా వేగమై రమ్మనను
నిదానమైనా నిలకడగానే రా…
నక్షత్రాలు మెరిసే సమయానికి
చందమామ తొంగిచూసే వేళకు
అందమైన చల్లనైనా పండువెన్నెల
పువ్వుల వర్షమై కురిసే సమయానికి రా…. ప్రియతమా…
పాఠశాల అపహాస్యమైతే విద్య నిరర్థకము!