telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఫ్రాన్స్ లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 14 వేల పాజిటివ్ కేసులు

corona vairus

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఫ్రాన్స్ లో మళ్లీ విజృంభించింది. ఇటీవల కొంతకాలంగా తగ్గినట్టు కనిపించిన కరోనా వైరస్ తిరిగి ఉగ్రరూపం దాల్చడంతో ఫ్రెంచ్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వైరస్ రెండో తాకిడి అనుకున్నదానికంటే వేగంగా వచ్చేసిందని వారు పేర్కొన్నారు. ఫ్రాన్స్ లో గత 24 గంటల్లో 14,412 కొత్త కేసులు వచ్చాయి. దాంతో అక్కడి అధికార యంత్రాంగం మళ్లీ ఉరుకులు పరుగులు పెడుతోంది.

ఫ్రాన్స్ లోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ డాక్టర్స్ చీఫ్ పాట్రిక్ బోయట్ మాట్లాడుతూ కరోనా మళ్లీ దేశంలో ఇంత త్వరగా వచ్చేస్తుందని అనుకోలేదని తెలిపారు. ఫ్రాన్స్ ఆరోగ్యమంత్రి ఒలివర్ వెరాన్ చేసిన హెచ్చరికలు ఏమంత ప్రభావవంతంగా లేవని తెలిపారు.

Related posts