telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

క్రిష్ సినిమాలో ర్తకులు పాత్ర అదేనా..?

Rakul-PReeth-Singh

దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్న నూతన సినిమాలో రకుల్ ఆ కారకమైన పాత్ర చేయనుంది. ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో వైష్ణమ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ కీలక పాత్ర చేయనుంది. ఈ సినిమా కథ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి గారి నవల ‘కొండపొలం’ ఆధారంగా చేసుకొని చేయనున్నారు. ఈ కథకు కావలసిన రైట్స్‌ను క్రిష్ తన సొంతం చేసుకున్నాడు. ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేశారు. ఈ నవల కథ ఎక్కువగా నల్లమల్లా అడవులలోని గొర్రెకాపరుల జీవితాలపై నడుస్తుంది. వారు తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు. వారు ఏవిధంగా నివసించేవారు అనే అంశాలపై దృష్టి పెట్టారు. ఈ కథను గౌతమీపుత్ర శాతకర్ణి ఫేమ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించేందుకు ఆలోచించారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ అనే పాత్రను చేయనుంది. ఈ సినిమాతో రకుల్ అభిమానులను తన లుక్స్‌తేనే కాకుండా రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఆశ్చపరుస్తుందని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు కాలేదు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts