telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మూడు రోజులకొకసారి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి: సీఎం జగన్

కరోనా నివారణపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దీని నివారణకు చేపట్టాల్సిన చర్యలపై వారితో చర్చించారు.

పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, గ్రామ, వార్డు, సచివాలయాల ఉద్యోగులకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి రెండు, మూడు రోజులకొకసారి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేసులు పెరుగుతున్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

Related posts