telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఎండాకాలం ప్రతీ ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

Summer Sun Temperatures AP
  • ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

1 ) పొద్దున్నే లేచిన వెంటనే ముందు బోర్లా పడుకోవాలి. అప్పుడు వీపు మీద చెమట కాస్త ఫ్యాన్ గాలికి ఆరి, మళ్ళా కాసేపు నిద్రపోవాలనిపిస్తుంది.

2) అల్పాహారం లో కారప్పొడి ఆవకాయ లాంటివి మింగి చావకండి. గొంతు లో వేడి కి డ్రాగన్ల లాగ పొగలు కక్కుతారు. మాయదారి సంత!

3) ఆరారుగా మజ్జిగలు తాగండి. మాటిమాటికీ ఆ పెప్సీ కోలాలు తాగకండి. మీ మొహాలు మండ…మొన్ననే యూట్యూబు లో చూసా వాటితో తాయిలెట్ లు బాగా క్లీన్ అవుతాయట!

4) బ్యాగ్ లో గొడుగు పెట్టుకు చావండి. నడి నెత్తిన మిట్టమధ్యానం సూరీడు కొట్టే మొట్టికాయలకి ఇంటికొచ్చే సరికి గతం మర్చిపోతారు. పెద్దగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలేవీ లేకపోతే కానివ్వండి.

5) మిట్టమధ్యాహ్నం బిర్యానీలు తిని బ్రేవుమంటూ కూర్చోక, కాస్త మజ్జిగన్నం కూడా తినేడవండి. లేదంటే మీ కడుపు మంట కి అంటార్కుటికా లో పెంగ్విన్ లు చలిమంట కాచుకోచ్చు!

6) పిచ్చి పిచ్చి గా పిజ్జాలూ బర్గర్లూ మాని పుచ్చకాయలు తాటి ముంజులు లాంటివి మేయండి. లేదంటే మీ ఒంటి మీదే బట్టలారేస్కోచ్చు!

 

Related posts