telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

కొత్త రకం సైబర్ మోసం… జియో పేరుతోనే

cyber attacks

ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్‌ వాడుతూనే ఉన్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఈ ఫోన్లు అలవాటుగా మారిపోయాయి. ఇదే అదునుగా చేసుకుని సైబర్‌ కేటుగాళ్లు దారుణాలకు పాల్పడుతున్నారు. అన్యాయంగా వారి దగ్గరి డబ్బులను నొక్కేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది..  జియో కస్టమర్లు పేరుతో… కొత్త రకం సైబర్ మోసానికి తెర లేపారు. జియో కస్టమర్లకు మీ సిమ్ బ్లాక్ అవుతుందంటూ.. రిచార్జ్ చేయాలంటూ కస్టమర్ కేర్ పేరుతో మెసేజ్ చేస్తున్నారు.
రిమోట్ యాక్సెస్ యాప్ ద్వారా రిచార్జ్ చేయమన్న చీటర్స్…. యాప్ ద్వారా అకౌంట్ లో డబ్బులు మాయం చేస్తుంది ఈ ముఠా. ఈ విధంగానే ఇద్దరు మహిళల నుండి 2.7 లక్షలు మోసం చేశారు ఈ ముఠా సభ్యులు. దీంతో మోసపోయిన మహిళలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. జియో కస్టమర్లు సైబర్ చీటర్స్ నుండి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు.

Related posts