telugu navyamedia
ఆరోగ్యం సామాజిక

వినాయక చవితి పూజ‌లో 21 రకాల పత్రాలు..

వినాయక చవితి భారతీయుల అతిముఖ్య పండుగలలో ఒక పండగ. భాద్రపద మాసం లో జరుపుకునే పండగల్లో విశిష్టమైనది వినాయక చవితి.. ఈరోజున విఘ్నలను తొలగించి చక్కటి విజయాలను అందించామని లంబోదరుడిని పూజిస్తాం.. ఇక వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తాం.. వినాయక‌చ‌వితి రోజు వినాయ‌కుడ్ని పూజించే 21 ప‌త్రిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని ఆయుర్వేద వైద్యం తెలుపుతుంది..

Ganesh Chaturthi 2021 date, time and significance - Times of India

అనేక‌ ఔషధ గుణాలున్న ఈ పత్రాలను వినాయక చవితి నవరాత్రులలో ఇంట్లో ఉంచుకున్నందువల్ల పత్రాల నుండి, అలాగే కొత్తమట్టితో తయారుచేసిన గణనాధుడి నుండి ప్రాణవాయువులు వెలువడి ఆ కుటుంబంలోని అందరికి ఆయురారోగ్యాలు పంచుతుంది..ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయంట‌.

Benefits Of Patri Vinayaka Puja | Pooja Procedure

చ‌వితి రోజు పూజకు ఉపయోగించే 21 రకాల పత్రాల ఔషధ గుణాలేంటో తెలుసుకుందాం..

1. మాచీ పత్రం (మాచ పత్రి): ఈ ఆకు సువాస‌న‌లు వెద‌జ‌ల్లుతుంది. అందుకే దీని వాస‌న చూస్తే ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి మాన‌సిక ఉల్లాసం క‌లుగుతుంది.

2. దూర్వా పత్రం (గరిక): మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే గుణాలు గ‌రిక‌లో ఉన్నాయి.

3. అపామార్గ పత్రం (ఉత్తరేణి): ద‌గ్గు, ఆస్త‌మా స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఉత్త‌రేణి ఆకులు బాగా ప‌నిచేస్తాయి.
4. బృహతీ పత్రం (ములక): ఈ ఆకు శ్వాస కోశ స‌మ‌న్యల‌ను న‌యం చేస్తుంది. ముఖ్యంగా ఉబ్బసం ఉన్నవారికి ఈ ఆకును వాడితే గుణం క‌నిపిస్తుంది.
5. దత్తూర పత్రం (ఉమ్మెత్త) : శ్వాస‌కోశ వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో ఉమ్మెత్త బాగా ప‌నిచేస్తుంది. ముఖ్యంగా ఆస్తమా వ్యాధిని త‌గ్గిస్తుంది.
6. తులసీ పత్రం( తులసి): శ‌రీరం వేడిగా ఉండేవారి శరీరం చల్లబడాలంటే తుల‌సి ఆకుల‌ను న‌మ‌లాలి. అలాగే శ్వాస కోశ స‌మ‌స్యల‌కు కూడా తుల‌సి దివ్య ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.
7. బిల్వ పత్రం (మారేడు): షుగ‌ర్ వ్యాధి ఉన్నవారు మారేడు మంచి ఔషధం. అలాగే విరేచ‌నాలు కూడా త‌గ్గుతాయి.
8. బదరీ పత్రం (రేగు): చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికీ రేగు ఆకులు మంచి మెడిసిన్.
9. చూత పత్రం (మామిడి): నోటి దుర్వాస‌న‌, చిగుళ్ల వాపు స‌మ‌స్య‌ల‌ను మామిడి ఆకు త‌గ్గిస్తుంది. మామిడి పుల్ల‌ల‌తో దంతాల‌ను తోముకుంటే నోరు దుర్వాస‌న రాకుండా ఉంటుంది.
10. కరవీర పత్రం (గన్నేరు): గ‌డ్డ‌లు, పుండ్లు, గాయాలు త‌గ్గేందుకు ఈ మొక్క వేరు, బెర‌డును ఉప‌యోగిస్తారు.
11. మరువక పత్రం (ధవనం, మరువం): ఈ ఆకులు సువాస‌న‌ను వెద‌జ‌ల్లుతాయి. వీటి వాస‌న చూస్తే ఒత్తిడి వెంటనే తగ్గుతుంది.
12. శమీ పత్రం (జమ్మి): నోటి సంబంధ వ్యాధుల‌ను త‌గ్గించ‌డానికి జ‌మ్మిఆకులు మంచి సహాయకారి.
13. విష్ణుక్రాంత పత్రం: ఈ ఆకుల‌తో చ‌ర్మ సౌంద‌ర్యం మ‌రింత పెరుగుతుంది.
14. సింధువార పత్రం (వావిలాకు): కీళ్ల నొప్పుల స‌మ‌స్య ఉన్న‌వారు ఈ ఆకును వాడితే ఉప‌యోగం ఉంటుంది.
15. అశ్వత్థ పత్రం (రావి): చ‌ర్మ స‌మ‌స్య‌లు వారికి రావి ఆకులు బెస్ట్ మెడిసిన్
16. దాడిమీ పత్రం (దానిమ్మ): వాంతులు, విరేచ‌నాల‌ను అరిక‌ట్ట‌డంలో దానిమ్మ ఆకులు  మంచి మెడిసిన్.
17. జాజి పత్రం (జాజిమల్లి): చ‌ర్మ స‌మ‌స్య‌లున్న‌వారు, స్త్రీ సంబంధ వ్యాధుల‌కు ఈ ఆకును ఉప‌యోగిస్తే ఫ‌లితం ఉంటుంది.
18. అర్జున పత్రం (మద్ది): గుండె ఆరోగ్యానికి, ర‌క్తం సరఫరా అయ్యేందుకు ఈ ఆకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.
19.దేవదారు పత్రం: శ‌రీరంలో బాగా వేడి ఉన్న వారు ఈ ఆకుల‌ను వాడితే ఫ‌లితం ఉంటుంది.
20. గండలీ పత్రం (లతాదూర్వా): అతిమూత్ర స‌మ‌స్య ఉన్న‌వారు ఈ ఆకును ఉప‌యోగిస్తారు
21. అర్క పత్రం (జిల్లేడు): న‌రాల బ‌ల‌హీన‌త‌, చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న వారికి ఈ ఆకులు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

Related posts