పెళ్లి అయిన తర్వాత కూడా సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది సమంత అక్కినేని. పెళ్ళికి ముందు తర్వాత కూడా తన నటనతో ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులకు వినోదాల విందు అందిస్తుంది. ఇక డాన్స్ పరంగాను సమంతికి ఇబ్బంది లేదు. అత్యంత కష్టమైన స్టెప్పులను సైతం తన సోంత స్టైల్‌తో చేసి అందరినీ మెప్పిస్తారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఛాలెంజ్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ ఇచ్చిన ఛాలెంటజ్‌ను సమంత స్వీకరించారు. అందులో భాగంగా ఓ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన వీడియోను సమంత షేర్ చేశారు. ఈ వీడియోలో సమంత వేసిన బెల్లీ మూవ్‌మెంట్స్ అందిరినీ ఆకట్టుకున్నాయి. నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్ పాత్రలో సమంత కనిపించనున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. ఎప్పటికి విడుదల అబుతుంది అనేది.
previous post