పార్టీలో ఒక్కొక్కరు జైలు పాలవుతుంటే చంద్రబాబుకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. “రాష్ట్రంలో అన్ని స్థాయిల ఎన్నికలు పూర్తయ్యాయి. కరోనా నియంత్రణ చర్యల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. ఇంక ఎవరి దృష్టి మళ్లిస్తే ఎవరికి లాభం చంద్రబాబూ? నీ బందిపోటు ముఠాలో ఒక్కొక్కరు జైలు పాలవుతుంటే భయం పట్టుకుందా? పొంతన లేకుండా మాట్లాడుతున్నావు. తుని నియోజకవర్గంలో తుక్కు తుక్కు అయ్యాక ఫ్రస్టేషన్ పీక్ కు చేరింది యనమలకు. చిత్తుగా ఓడిన ధూళిపాళ్లను వందల కోట్ల అవినీతి కేసులో అరెస్టు చేస్తే రాజకీయంగా ఎదుర్కోలేక లోపలేయించిందంట ప్రభుత్వం. ధూళి గెలిపించిన మున్సిపాలిటీలెన్ని, పంచాయితీలెన్ని? నీలాగే గుండు సున్నా కదా! పాడి రైతుల ఉసురుపోసుకున్న ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టయితే చంద్రబాబు, ఆయన బందిపోట్ల ముఠా అమూల్ కు మేలు చేయడానికి సంగంను దెబ్బ తీస్తోందని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.
previous post
next post