telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి…

amazon

తెలంగాణ రాష్ట్రంలో రూ.20,761 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లుగా అమెజాన్ వెబ్ సర్వీసేస్ సంస్థ తెలిపింది. తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లుగా అమెజాన్ తెలిపింది. హైదరాబాదులో మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనున్నట్లుగా ఆ సంస్థ పేర్కొంది. ప్రతి అవైలబిలిటీ జోన్లో అనేక డాటా సెంటర్ల ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటన చేసింది. 2022 సంవత్సర ప్రథామార్దంలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లుగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ తెలిపింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే కావడం విశేషం. ఇంత భారీ పెట్టుబడి రావడం అంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలకు ఉన్న ప్రాధాన్యత అర్థం అవుతుందన్నారు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణ పారదర్శక మరియు వేగవంతమైన పరిపాలన విధానాల వల్లనే తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ను తన దావోస్ పర్యటనలో కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు కేటీఆర్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడి తర్వాత తెలంగాణ డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పెట్టుబడి ద్వారా ఇప్పటికే అతిపెద్ద కార్యాలయాన్ని కలిగి ఉన్న అమెజాన్ సంస్థతో తెలంగాణ బంధం మరింత బలోపేతం అవుతుంది అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Related posts