telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

లాక్ డౌన్ పై తెలంగాణ హైకోర్టు సీరియస్..

లాక్ డౌన్ పై తెలంగాణ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేపటి నుంచి లాక్ డౌన్ అంటే ఇతర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి ? అని హైకోర్టు సీరియస్ అయింది. కనీసం వీకెండ్ లాక్ డౌన్ ఆలోచన లేకుండా ఇంత సడెన్ నిర్ణయం ఏంటి ? అని నిలదీసింది. ఇతర ప్రాంతాల వాళ్ళు తక్కువ టైమ్ లో ఎలా వెళతారు ? అని హైకోర్టు ప్రశ్నించింది. ఇవాళ ఉదయం 10 గంటల వరకు మీకు కనీసం వీకెండ్ లాక్ డౌన్ ఆలోచన లేదని.. సడెన్ గా రేపటి నుంచి లాక్ డౌన్ అంటే ఎలా ? అని హైకోర్టు నిలదీసింది. కాగా..తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ ఉండనుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు లాక్ డౌన్ నిర్ణయం తీసుకోగా.. మారికాసేపట్లో లాక్ డౌన్ మార్గదర్శకాలపై పూర్తి క్లారిటీ రానుంది. 

Related posts