telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కోవిడ్ వార్డ్ లో పెళ్లి…

marriage

పెళ్లి మాత్రం అనుకున్న ముహూర్తానికే చేసుకోవాల‌ని ప‌ట్టుబ‌ట్టి చివ‌ర‌కు అనుకున్న స‌మ‌యానికి కోవిడ్ పాజిటివ్‌గా తేలిన యువ‌కుడి.. అది కూడా.. కోవిడ్ వార్డులోని.. పీపీఈ కిట్లు ధ‌రించి మ‌రి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో కేర‌ళలో వెలుగు చూసింది.. కైనంక‌రికి చెందిన శ‌ర‌త్ మాన్, అభిరామికి పెళ్లి కుదుర్చారు పెద్ద‌లు.. ముహూర్తం ప్ర‌కారం.. ఇవాళ పెళ్లి జ‌ర‌గాల్సి ఉండ‌గా.. వారం రోజుల ముందే.. పెళ్లి కుమారుడు శ‌ర‌త్‌, అత‌ని త‌ల్లి కోవిడ్ బారిన‌ప‌డ్డారు.. దీంతో ఆ ఇద్ద‌రు అల‌ప్ఫూజా మెడిక‌ల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు.. అయితే, కాబోయేవాడు, అత్త క‌రోనా వార్డులో ఉన్నా.. అనుకున్న స‌మ‌యానికి పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన వ‌ధువు అభిరామి.. త‌న ఆలోచ‌న‌ను ముందుగా కుటుంబ‌స‌భ్యుల‌కు తెలిపింది.. ఆ త‌ర్వాత అంతా వెళ్లి జిల్లా క‌లెక్ట‌ర్ ముందు త‌మ ప్ర‌తిపాద‌న‌ను ఉంచారు.. ఇక‌, ఆయ‌న కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో.. కోవిడ్ వార్డే పెళ్లి మండ‌పంగా మారిపోయింది.. పెళ్లి కూతురు అభిరామి పీపీఈ కిట్ ధ‌రించి పెళ్లి చేసుకున్నారు.

Related posts