ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆర్‌సీబీ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ సైతం ఆర్‌సీబీ-సీఎస్‌కే మ్యాచ్‌కు ముందు ఈ వీడియోలను ప్లే చేసింది. ప్రతీ ఒక్కరు ఓ కెప్టెన్‌లా తమ కుటుంబాలకు రక్షణగా నిలవాలని ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రజలను కోరాడు. ‘హాయ్.. నేను విరాట్ కోహ్లీ. ఒక కెప్టెన్‌గా నేను ముందుండి నడిపిస్తాను. నా చుట్టూ ఉన్నవాళ్లకు సహకరిస్తాను. మీరందరు కూడా నాలాగే చేయాలని కోరుతున్నా. చేతులను శుభ్రపరచుకోండి. అవసరమైతేనే బయటకు వెళ్లండి. అన్ని వేళలా మాస్కులు ధరించండి. మీరు ఆరోగ్యంగా ఉండటంతో మీ కుటుంబంతో పాటు చుట్టు పక్కలవారికి రక్షణగా ఉండండి’అని విరాట్ కోహ్లీ విజ్ఞప్తి చేశాడు. ఈ ఆపత్కాలంలో రక్షించడానికి ఏ సూపర్ హీరో రాడని, ఎవరికి వారే సూపర్ హీరోలా తమ కుటుంబాలను కాపాడుకోవాలని, ఈ వైరస్ నుంచి బయటపడాలని ఏబీ డివిలియర్స్ పిలుపునిచ్చాడు.
previous post
next post