telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ కు ఇంగ్లండ్ బెస్ట్ అంటున్న కెవీన్ పీటర్సన్…

Kevin

సెప్టెంబర్‌లో ఐపీఎల్‌-2021 లో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణకు బీసీసీఐ సిద్దం కావాలని విజ్ఞప్తి చేశాడు మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌. అప్పుడు యూకేలో వాతావరణం అద్భుతంగా ఉంటుందని తెలిపాడు. భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత సెప్టెంబర్ కచ్చితంగా ఖాళీ విండో లభిస్తుందని, ఈ విషయం గురించి యూకేలోనూ చర్చించుకుంటున్నారన్నాడు. టీమిండియా ప్లేయర్లు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి ఫారిన్ క్రికెటర్లు సులువుగా ఇక్కడికి వచ్చేస్తారని తెలిపాడు. ‘సెప్టెంబర్‌ చివర్లో ఐపీఎల్‌ నిర్వహించేందుకు యూఏఈ సరైన వేదిక అని చాలా మంది చెబుతున్నారు. కానీ ఆ సమయంలో ఇంగ్లండ్‌లో వాతావరణం చాలా బాగుంటుంది. మాంచెస్టర్, లీడ్స్, బర్మింగ్‌హామ్, లార్డ్స్, ఓవల్‌ మైదానాలను ఉపయోగించుకోవచ్చు. ప్రేక్షకులను కూడా అనుమతిస్తే అద్భుతంగా ఉంటుంది. ఐపీఎల్‌ ఇప్పటికే యూఏఈ, దక్షిణాఫ్రికాలలో జరిగింది కాబట్టి ఈసారి ఇంగ్లండ్‌లో నిర్వహిస్తే బాగుంటుంది. ఒక్కసారి భారత్, ఇంగ్లండ్‌ సిరీస్‌ ముగిసిందంటే అగ్రశ్రేణి ఆటగాళ్లంతా అక్కడే అందుబాటులో ఉంటారు కూడా’ అని పీటర్సన్‌ చెప్పుకొచ్చాడు.

Related posts