భారత్, పాక్‌ల కశ్మీర్ వివాదం ద్వైపాక్షిక అంశంమని మొదటి నుండి చెబుతూ వస్తోంది. అమెరికా మధ్యవర్తత్వాన్ని కూడా సున్నితంగా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో భారత్ పొరుగు దేశమైన నేపాల్ సంచలన నిర్ణయం తీసుకున్నటు తెలిసింది. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం నెరపేందుకు తాము సిద్ధమేననని నేపాల్ పేర్కొనట్టు తెలుస్తోంది. దాయాది దేశాల మధ్య నెలకొన్న బేధాభిప్రాయాలను చర్చల ద్వారానే తొలగించుకోవాలని ఓ నేపాల్ ప్రభుత్వ అధికారి వ్యాఖ్యానించారు.
భారత్ పాక్‌ల మధ్య పరిస్థితులు చక్కబడితే.. దక్షిణాసియా దేశాల సార్క్ కూటమి కూడా పునరుత్తేజితమవుతుందని తెలిపారు. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తరువాత దయాది దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దిగజారిన నేపథ్యంలో నేపాల్ నిర్ణయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది రూఢీ అయితే కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వానికి మందుకు వచ్చిన మొదటి దక్షిణాసియా దేశంగా నేపాల్ గుర్తింపు పొందనుంది.