telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

స్థానిక ఎన్నికలలో .. జాతీయస్థాయి రికార్డు సాధించిన.. తెరాస..

eone mlc nomination from trs on last day

తెరాస స్థానిక ఎన్నికల విజయంతో జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించింది. గులాబీ దళం నేషనల్ రికార్డు సాధించింది. తాజా మునిసిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అంశం తేటతెల్లమైంది. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విధంగా ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 120 మునిసిపాలిటీల్లో 109 మునిసిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అంటే 91 శాతం మునిసిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ సాధించింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోను, ఏ పార్టీ సైతం ఇప్పటి వరకు సాధించని విజయమిది. అధికారపార్టీగా ఎంతో కొంత సానుకూల పరిస్థితి వుంటుంది. కానీ, ఈ స్థాయిలో 90 శాతం కంటే మించిన సీట్లను ఒక పార్టీ గెలుచుకోవడం మాత్రం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

అటు కార్పొరేషన్లలోను మొత్తం పది నగర పాలక సంస్థలు తెలంగాణలో వుంటే.. కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికలను పక్కన పెడితే.. మిగిలిన తొమ్మిది కార్పొరేషన్లకు గాను ఏడింటిని తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకుంది. అంటే సుమారు 77 శాతం సీట్లను టీఆరఎస్ గెలుచుకుందన్నమాట. దేశంలో వందలాది పార్టీలుండగా.. వాటిలో అధికారంలోకి వచ్చిన, వచ్చే పార్టీలతో పోలిస్తే.. టీఆర్ఎస్ రికార్డు అనితర సాధ్యమని పరిశీలకులు అంఛనా వేస్తున్నారు.

Related posts