telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు.. ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల ..

ibps rural bank recruitment notification

దేశ వ్యాప్తంగా వివిధ రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 8 వేల 400 పోస్టుల భర్తీకి, ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సన్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇందులో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ తదితర పోస్టులున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 829 ఖాళీలున్నాయి.

అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ / సంస్థ నుంచి సబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, పోస్టులను బట్టి పని అనుభవం ఉండాలి. స్థానికంగా భాష వచ్చి ఉండాల్సి ఉంటుంది.

వయస్సు : ఆఫీసర్ స్కేల్ -1 పోస్టులకు 18- 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్ – 2 పోస్టులకు 21 – 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్ – 3 పోస్టులకు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. OBC లకు మూడేళ్లు, SC, STలకు అయిదేళ్లు, PHCలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.

ఎంపిక : ప్రిలిమనరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ. 100, మిగిలిన వారికి రూ. 600 ఉంటుంది.

విభాగం-ఖాళీలు :
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)-3688
ఆఫీసర్ స్కేల్ – 1-3381
ఆఫీసర్ స్కేల్ – 2 (అగ్రికల్చర్ ఆఫీసర్)-106
ఆఫీసర్ స్కేల్ – 2 (మార్కెటింగ్ ఆఫీసర్)-45
ఆఫీసర్ స్కేల్ – 2 (ట్రెజరీ ఆఫీసర్)-11
ఆఫీసర్ స్కేల్ – 2 (లా )-19
ఆఫీసర్ స్కేల్ – 2 (సీఏ)-24
ఆఫీసర్ స్కేల్ – 2 (ఐటీ)-76
ఆఫీసర్ స్కేల్ – 2 (జనరల్ బ్యాకింగ్)-893
ఆఫీసర్ స్కేల్ – 3-157
మొత్తం=8400

Related posts