నేడు ఏపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. రెండ్రోజుల పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరికీ తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాజకీయ ప్రముఖుల తో తరగతులు నిర్వహించనున్నారు. టీడీపీ సభ్యులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ప్రభుత్వ విధానానికి అనుగుణంగానే ఎమ్మెల్యేలకు సభా సంప్రదాయాలపై శిక్షణ ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఎలాంటి వృధా ఖర్చులు లేకుండానే అసెంబ్లీ కమిటీ హాల్‌లో శిక్షణా తరగతులు చేపట్టినట్లు తెలిపారు.
గత ప్రభుత్వం ఎమ్మెల్యేలకు శిక్షణ పేరుతో ఖరీదైన హోటళ్లలో విందులు, డ్యాన్సులతో ప్రజాధనాన్ని వృధా చేసిందని ఆరోపించారు. ఈ శిక్షణా తరగతలు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. శిక్షణా తరగతుల వల్ల సభ్యులకు చాలా ఉపయోగం ఉంటుందని మంత్రి కన్నబాబు అన్నారు. గతంలో స్పీకర్ అధికార పక్షానికి కొమ్ముకాయడం వల్ల సంప్రదాయాలు పక్కదారి పట్టాయని విమర్శించారు. సభను హుందాగా, ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగించేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అన్నారు.
ఇష్టం ఉన్నా లేకపోయినా భార్య చెప్పింది చచ్చినట్లు వినండి : పూరి జగన్నాథ్