telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరు ట్వీట్ పై స్పందించిన పవన్ కళ్యాణ్

pavan

హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి హనుమంతుడిపై తనకున్న భక్తిని తన అభిమానులతో పంచుకున్నారు. ట్విట్టర్ వేదికగా ఆంజనేయస్వామితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే చిరంజీవి హనుమాన్ భక్తిపై తాజాగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. చిరు ట్వీట్ పై స్పందించిన పవన్… హనుమంతుడిపై భక్తి నమ్మకం మా ఇంటిల్లిపాదికి చిరంజీవి వల్లే వచ్చిందన్నారు. నాస్తికుడు, కమ్యూనిస్టు అయిన తన తండ్రి కూడా రాముని భక్తుడిగా మారారన్నారు. తాను కూడా టీనేజ్‌లో చాలాసార్లు హనుమాన్ చాలీసాను చదివేవాడినని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది.1962 లో నాకు ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. హనుమాన్ జయంతి సందర్భంగా పలు విషయాలు షేర్ చేసిన చిరు.. లాటరీలో తనకు వచ్చిన ఆంజనేయుని బొమ్మని భద్రంగా దాచుకున్నానన్నారు. తన చేతిలో ఆంజనేయస్వామి చూసిన తన తండ్రి “ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి” అన్నారు. అందుకే ఆంజనేయ బొమ్మని అప్పటి నుంచి ఇప్పటి దాకా నా దగ్గర అలాగే భద్రంగా ఉందని చెప్పుకొచ్చారు మెగాస్టార్.

Related posts