telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

రాజధానిలో … విజృంభిస్తున్న డెంగ్యూ ..

precautions on dengue

ఢిల్లీ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో డెంగ్యూ విజృంభిస్తోంది. ఈ వ్యాధితో ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఢిల్లీలో ఇప్పటివరకూ 1700కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ మున్సిపాలిటీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఢిల్లీలో నవంబరు 30 వరకూ మలేరియా కేసుల సంఖ్య 685గా ఉంది. నవంబరు 18 నాటికి డెంగ్యూ కేసుల సంఖ్య 1475గా ఉంది. తాజా లెక్కల ప్రకారం ప్రస్తుతం డెంగ్యూ కేసుల సంఖ్య 1786గా నమోదయ్యింది.

ఈ ఏడాది నవంబరులో కొత్తగా 717 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అక్టోబరులో అత్యధికంగా 787 డెంగ్యూ కేసులు నమోదుకాగా, 249 మలేరియా కేసులను గుర్తించారు. కాగా డెంగ్యూ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Related posts