telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పుష్పకు బాహుబలి ఫార్ములా… భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అందరికీ సుపరిచితమే. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో ప్రేక్షకులను అరిస్తారు. అయితే తాజాగా అర్జున్ చేస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను స్టార్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో లక్కీ బ్యూటీ రష్మికా హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది.  ‘పుష్ప’ రెండు భాగాలుగా రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది యూనిట్. మైత్రీ మూవీస్ పతాకంపై సుకుమార్ దర్శత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం కొద్ది పాటి సన్నివేశాలు మినహా పూర్తయిందట. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ‘బాహుబలి’లా ‘పుష్ప’ రెండు భాగాలుగా రానుందంటూ వైరల్ అవుతోంది. రశ్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రతి నాయకుడుగా మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండు భాగాలను దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తామంటున్నారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి. అక్టోబర్ రెండో వారంలో ఈ సినిమా తొలి భాగాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related posts