telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా… సింగిల్ షెడ్యూల్ లో సినిమా షూటింగ్

NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘అరవిందసమేత వీరరాఘవ’ అనే చిత్రం వచ్చింది. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌తో వీరి కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది. టైటిల్ అయితే అధికారికంగా ప్రకటించలేదు కానీ.. మూవీ ప్రకటన మాత్రం వచ్చింది. ఈ లాక్‌డౌన్‌లో ఇతర నటీనటులను కూడా త్రివిక్రమ్ కన్ఫర్మ్ చేసినట్లుగా సమాచారం. ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ అదిరిపోయే కథను సిద్ధం చేసాడని తెలుస్తుంది. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు ఆయన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఓ అదిరిపోయే క్యారెక్టర్‌ను రాసుకున్నాడట త్రివిక్రమ్. సంజయ్ దత్ ఈ సినిమాలో పక్కా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడట. ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ తో కలిసి నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకం పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఇక కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ విషయంలో డైలమాలో పడ్డారట చిత్ర నిర్మాతలు దాంతో త్రివిక్రమ్ ఓ ప్లాన్ వేసాడట. గ్యాప్స్ లేకుండా సింగిల్ షెడ్యూల్ లో సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నాడట. ఇందుకోసం షూటింగ్ మొత్తం ఇండోర్ లోనే చేస్తారని తెలుస్తోంది. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఆర్ఆర్ఆర్ షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యేది. ఇదే సమయంలో త్రివిక్రమ్ దర్వకత్వంలో సినిమా మొదలయ్యేది. వచ్చే సమ్మర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కాని కరోనా కారణంగా రివర్స్ అయ్యింది.

Related posts