telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పేద, ధనిక తేడా లేకుండా అందరికీ రక్షిత మంచినీరు: సీఎం కేసీఆర్

kcr special pooja in kaleswaram

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలో పర్యటించారు. అనంతరం ధర్మపురిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహాస్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద, ధనిక తేడా లేకుండా అందరికీ మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీరు అందిస్తున్నామని అన్నారు. మిషన్ భగీరథ అద్భుతమైన ఫలితానిచ్చిందని భవిష్యత్ కోసం శాశ్వత మంచినీటి వనరులను సమకూర్చుకున్నామని తెలిపారు. గతంలో తెలంగాణలో అప్పులేనటువంటి రైతు లేడని, వారి అప్పులు తీరిపోయి మిగులు సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అదనంగా 400 టీఎంసీలు లభిస్తాయని, తద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు, 56 లక్షల గృహాలకు తాగునీరు లభిస్తుందని అన్నారు. ప్రతిరోజూ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఎల్లంపల్లికి మూడు టీఎంసీలు, ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ కు రెండు టీఎంసీలు నీరు అందుతుందని అన్నారు. రాబోయే రెండేళ్లలో ఎస్సారెస్సీ, నిజాంసాగర్, సింగూర్ ప్రాజెక్టులకు నీరు అందిస్తామని అన్నారు.

Related posts