telugu navyamedia
తెలంగాణ వార్తలు

జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే..

*ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు..
*ఈఘ‌ట‌న‌పై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాలి..
*కేసులో సాక్ష్యాల‌ను తారుమారు చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది..
*ప‌బ్‌ను ఒక‌రు బుక్ చేస్తే..మ‌రొక‌రు పేరును ఇరికిస్తున్నారు.
*నిందితుల‌ను ఇత‌ర రాష్ర్టాల‌కు, ఇత‌ర దేశాల‌కు పంపిస్తున్నారు..

హైదరాబాద్​లో మైనర్​ బాలికపై ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం చేశాడని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు.

శనివారం నాడు హైదరాబాద్‌లో మీడియా ప్రెస్‌ మీట్ నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు కారులో జరిగిన ఘటనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలు రిలీజ్ చేశారు. ఈ ఫొటోల్లో ఉన్నది ఎమ్మెల్యే కొడుకు కాదా అని ప్రశ్నించారు

ఈ కేసులో పోలీసులే జడ్జ్‌మెంట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే కొడుకు, హోంమంత్రి మనవడు లేదంటూ పోలీసులు క్లీన్ చీట్ ఎలా ఇచ్చేస్తారు? అందుకు కోర్టు ఉంది కాదా. ఆరోపణ వచ్చినప్పుడు విచారణ చేయాలి. సీసీ టీవీ ఫుటేజీ పై అనుమానాలు ఉన్నప్పుడు ప్రజల ముందు ఉంచాలి. కానీ ఓ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి అంతా అయిపోయింది వీళ్లే నిందితులు అని చెప్పడం సరికాదు.

నిందితుల ఫొటోలను ఎందుకు సీక్రెట్‌గా ఉంచారని ప్రశ్నించారు. నిర్బయ కేసులో మైనర్ ఉన్నా చూపించలేదా అని ప్రశ్నించారు. అధికార పార్టీ, డబ్బున్నవారి పిల్లనే ఫొటోలు బయటకు చూపించడం లేదని ఆరోపించారు.

బాధితుల తరపున మాట్లాడితే కేసులు పెడతామంటున్నారు. మమ్మల్ని కాదు.. తప్పులు చేసిన వారిని అరెస్ట్‌ చేయండి. అసలు నిందితులను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్‌ చేయలేదని రఘునందన్‌రావు నిలదీశారు.

హైదరాబాద్‌లో పోలీస్ కంట్రోలింగ్ మొత్తం మజ్లిస్ చేతిలో ఉంది. అవసరమైతే టీఆర్ఎస్ వాళ్లను రిమాండ్ చేస్తారు కానీ.. ఎంఐఎం వాళ్లను టచ్ చేయరు’ అని అన్నారు.

బెంజ్ కారులో ఉన్న వాళ్ళను వదిలేసి.. ఇన్నావో కారులో ఉన్నవాళ్ళను మద్దాయిలగా చూపుతున్నారు. ఎంఐఎం‌ వాళ్లను కేసులో నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు . ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని అన్నారు.

సీబీఐతో లేదంటే హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితోనైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిందేన‌ని అన్నారు. తన దగ్గర ఉన్న ఇతర ఆధారాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు, న్యాయస్థానాలకు అందజేస్తామని చెప్పారు.

Related posts