telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : .. వాయిదా పనులకు అనుకూలం.. ఉద్యోగంలో గుర్తింపు..

today rasi falalu

మేష రాశి : ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ సంతానం మీ ఆనందానికి కారణమవుతారు. అనుకోని ప్రయాణం కానీ, దేవాలయ సందర్శన చేస్తారు. వృత్తిలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి. ఆర్థికస్థితిమెరుగవుతుంది.

వృషభం : ఈ రోజు ఎంతోకాలంగా వాయిదా పడుతున్న పనులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. అనుకోని ఆర్థిక లాభం కానీ, రావలసిన డబ్బు తిరిగి రావడం జరుగుతుంది.

మిథునం : ఈ రోజు ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అవసరానికి తగిన డబ్బు లభించక పోవడం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవడం జరగవచ్చు. చేపట్టిన పనులు అనుకోకుండా వాయి దా పడుతాయి. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు.

కర్కాటకం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అనుకోని ప్రయాణం కారణంగా ఉదర లేదా ఛాతి సంబంధ ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. భూసంబంధ వ్యవహారాలు పూర్తి చేస్తారు.

సింహం : ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంచే దినం. మీరు రావలసినబకాయిలు రావడమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అదే విధంగా అనుకొని విధంగా డబ్బు రావడం కానీ, చేపట్టిన పనిలో విజయం వరిస్తుంది. ఉద్యోగ విషయంలో మార్పు కోరుకుంటున్న వారు శుభవార్త వింటారు.

కన్య : ఈ రోజు మీరు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావడం జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ సొంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

తుల : ఈ రోజు మీ వృత్తి విషయంలో దూర ప్రదేశం నుంచి ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువులను కలుసుకుంటారు.

వృశ్చికం : ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధ మైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువగా దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

ధనుస్సు : ఈ రోజు మీకు ఆనందంగా, లాభ దాయకంగా ఉంటుంది. పాత మిత్రులను కలవడం, వారితో రోజును ఆనందంగా గడపడం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

మకరం : ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరడం, మీరు అనుకున్న లక్ష్యానికి చేరువవడం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగవిషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

కుంభం : ఈ రోజు ప్రయాణం చేసే అవకాశం అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వల్ల ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవకాశముంటుంది.

మీనం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. మీ ఆవేశం లేదా అనాలోచితమైన పని కారణంగా డబ్బు నష్టపోయే అవకాశమున్నది. ఏ విషయమైనా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం మంచిది. ప్రయాణంలో అనవసరమైన చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనువైన రోజు కాదు.

Related posts