telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సుబ్బిరామిరెడ్డి అన్న కొడుకు ఇంట్లో భారీ చోరీ..

New couples attack SR Nagar

ప్రముఖ పారిశ్రామికవేత్త , కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి అన్న కొడుకు ఉత్తమ్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన సొమ్మును అపహరించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు-2లో ఉత్తమ్ రెడ్డి నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో ఎవరూలేని సమయంలో చోరీ జరిగింది. ఈరోజు ఉదయం తిరిగి వచ్చిన తర్వాత ఉత్తమ్‌రెడ్డి కుటుంబ సభ్యులు చూసుకోగా విలువైన వజ్రాల నగలు, నగదు మాయం అయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు దాదాపు రూ.2 కోట్ల విలువైన బంగారం, వజ్రాలతోపాటు రూ. కోటి నగదు దొంగలించినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. ఉత్తమ్ రెడ్డి నివాసం ఉంటున్న కాలనీ పరిసర ప్రాంతాల్లోనీ సీసీ టీవీ ఫుటేజ్‌ను సేకరిస్తున్నారు.

Related posts