telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కార్తీక అమావాస్య .. నదీస్నానాలకు శ్రేష్టం..

kartika amavasya v.good for nadi snanam

మాసాలలో కార్తీక మాసం ఎంతో ప్రధానమైనదని తెలిసిన విషయమే. ఈ మాసంలో ప్రతీరోజు చేసే పూజా ఫలితం విశేషమైన ఫలితాన్ని అందిస్తుందని శాస్త్రం చెబుతుంది. కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య కు భక్తులు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక అమావాస్య నేడు జరుపుకుంటున్నారు. యేడాది పొడుగునా వచ్చే అమావాస్యల్లో కార్తీక అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉంది. ఈరోజున శివకేశవ ఆలయాల్లో విశేష పూజలు, అర్చనలు నిర్వహిస్తారు. ఈరోజున కార్తీకమాస దీపాలను వెలిగించే చివరి రోజు కావడంతో నెలరోజుల దీపాలను వెలిగించిన పుణ్యఫలం ఈరోజు వెలిగించే దీపంతో పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఆలయాల్లో ఈరోజున దేవతలకు నిర్వహించే అభిషేకాలు, అర్చనలు సకల శుభాలు అందిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. కార్తీక మాసం అనగానే ఆలయాల్లో దామోదర పూజలు, కార్తీకదీపాలను వెలిగించడం ఆచా రంగా ఉంది. ఆమావాస్య రోజున దామోధర పూజ, కార్తీక దీపాలను వెలిగించి కార్తీక పురాణాన్ని చదవడం అత్యంత శ్రేష్టమని శాస్త్రవచనం. ఈరోజున నదీస్నానాన్ని ఆచరించడం శ్రేష్టమని భక్తులు భా విస్తారు.

శనిదోషం, అష్టమశని, అర్దాష్టమ శని దోషం ఉన్న వారు కార్తీక అమావాస్య రోజు శివుడికి, శనేశ్వరుడికి విశేష పూజలు నిర్వహించడం మంచిదని పండితులు పేర్కొంటున్నారు. కార్తీక అమావాస్య మంగళవారం రావడం అత్యంత శ్రేష్టమని అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రదోశ కాలంలో శివారాధన చేసుకుంటే, శివదర్శనం చేసుకుంటే శివ అనుగ్రహానికి పాత్రులవుతారని, అలాగే శివాలయాల్లో ప్రార్థనా, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్యకార్యక్రమాలు ఆచరించడం ఈరోజున సంవత్సరం మొత్తంలో చేసిన పుణ్యం లభిస్తుందని విశ్వాసం. తులసీదళాలతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ముక్తిదాయకం. శివకేశవుల అను గ్రహానికి ఈరోజు చేసే పూజ ఎంతో ఉత్కృష్టమైనదని, ఏ మంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలు వస్తాయని పండితులు పేర్కొంటున్నారు.

కార్తీకమాసం నదీస్నానం అత్యంత శ్రేష్టమని శాస్త్రం చెబుతోంది. కార్తీక మాసం నెల రోజుల పా టు నదీస్నానం ఆచరించని వారు ఈ ఒక్కరోజు స్నానం ఆచరించినంతనే ఎంతో పుణ్యఫలమని పండితులు పేర్కొంటున్నారు. టీవీ ఛానళ్లలో, సొష ల్‌ మీడియాలో కార్తీకమాస పూజా ఫలితాన్ని ప్రచారం చేయడంతో అత్యధికులు తమ భక్తిని ఈ కార్తీకమాసం నెలరోజులు పూజలు నిర్వంచారు. నెల రోజులపాటు నిర్వహించిన పూజలు చివరి రోజైన అమావాస్య రోజు పూజాదికార్యక్రమాలు నిర్వహించి యదాశక్తిగా దానధర్మాలు చేయడం పుణ్యఫ లంగా భక్తులు భావిస్తారు. నదీస్నానం ఆచరించే వారు ఉసిరికాయతో నదీస్నానం ఆచరించడం మంచిది. నదీస్నానం ఆచరించిన తర్వాత కార్తీక దీపాన్ని గంగమ్మకు సమర్పించాలి. అమా వాస్య మంగళవారం కావడం శక్తిదేవతలకు అత్యంత ప్రీతికరమైనదని గౌరీ, లక్ష్మి, సరస్వతి, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి శక్తిస్వరూపులకు విశేష పూజలు నిర్వహిస్తే సౌభాగ్యం, సకల శుభాలు పొందుతారని శాస్త్రం చెబుతోంది.

Related posts