telugu navyamedia
క్రీడలు వార్తలు

నా కెరీర్‌ ను గాయాలే దెబ్బతీశాయి : విజయ్ శంకర్

విధి తనతో ఆడుకుందన్నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమేనని చెప్పుకొచ్చాడు. తాజాగా మాట్లాడుతూ… ‘భారత జట్టులో అవకాశం వస్తుందా? లేదా? అనేది ఏ మాత్రం ఆలోచించడం లేదు. ఎందుకంటే అది నా చేతుల్లో లేదు. బాగా హార్డ్ వర్క్ చేసి నేను ఆడే మ్యాచ్‌ల్లో రాణించడమే నా ముందున్న కర్తవ్యం. కాకపోతే భారత జట్టులో చోటు కోసం నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఏ ఆటగాడికైనా దేశం తరఫున ఆడటాన్ని గౌరవంగా భావిస్తాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే నేను బాగా రాణించినప్పుడు కూడా అవకాశం దక్కకపోతే బాధగా ఉంటుంది. నిజాయితీగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టులో చోటు దక్కడం కష్టమే. టీమిండియాకు అరంగేట్రం చేసే సమయంలోను గాయాలు నన్ను ఇబ్బంది పెట్టాయి. ఒక సిరీస్‌లో మంచిగా ఆడుతున్న దశలోనే ఏదో ఒక గాయంతో జట్టుకు దూరమయ్యాను. టీమిండియాకు ఆడిన అన్ని సందర్భాల్లో మంచి ప్రదర్శనే నమోదు చేశా. కానీ విధి నాతో ఆడుకుంది. కెరీర్‌ మొత్తంలో నాకు గాయాలే ఎక్కువగా కనిపించాయి. మ్యాచ్‌లో బరిలోకి దిగిన ప్రతీసారి నా సాయశక్తుల ఆడే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటికీ నాకు అవకాశాలు మిగిలే ఉన్నాయి. నా ప్రయత్నం నేను చేస్తా.. కానీ ఎంపిక అనేది నా చేతుల్లో లేదు’అని చెప్పుకొచ్చాడు.

Related posts