telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

అమెజాన్ డెలివరీ బాయ్ నిర్వాకం… సీసీటీవీ కెమెరాలో రికార్డు

amazon prime sale open in 15th and 16th

ఫ్లోరిడాలోని ఓ ఇంటి ముందున్న సీసీటీవీ కెమెరాలో అమెజాన్ డెలివరీ బాయ్‌‌ చేసిన నిర్వాకం ఒకటి రికార్డు అయ్యింది. డెవలిరీ ఇవ్వడానికి వచ్చిన అతగాడు ఇంటి బయట ఉన్న చిన్నారి బైక్‌ను దొంగలించాడు. ఎంచక్కా పాప బైక్ వేసుకొని వెళ్లిపోవడం వీడియోలో రికార్డైంది. ఈ ఘటన ఓర్లాండో శివారులోని మౌంట్‌దొరలో ఆగస్టు 11వ తేదీన చోటుచేసుకుంది. దీంతో ఇంటి యజమానురాలు తన కూతురి బైక్ చోరీ చేసిన సదరు అమెజాన్ డెలవరీ బాయ్‌పై ఆరెంజ్ కౌంటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ బైక్ అంటే తన కూతురికి చాలా ఇష్టమని, ఎలాగైనా దాన్ని తెచ్చి ఇవ్వాలని పోలీసులతో మొరపెట్టుకుంది. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వీడియోలోని దృశ్యాల ఆధారంగా డెలవరీ బాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడ్ని విచారించగా… బైక్ పాతబడిపోవడంతో ఇంటి బయట పడేశారనుకొని తాను తీసుకెళ్లినట్టు పోలీసులతో చెప్పాడు. దాంతో పోలీసులు ఆ బైక్‌ను తీసుకెళ్లి ఇంటి ఓనర్‌కు అప్పగించాలని ఆదేశించారు. ఇప్పుడీ వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

Related posts