కమల్ ‘ఇండియన్ 2’ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. 20 ఏళ్ళ కింద వచ్చిన ‘ఇండియన్’ కు ఇప్పుడు దర్శకుడు శంకర్ సీక్వెల్ రూపొందిస్తున్న సంగతి విదితమే. కమలహాసన్, కాజల్ జంటగా ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్టుతో నిర్మిస్తోంది. ఇప్పటికే కొంత చిత్రీకరణ కూడా జరిగింది. ఆ తరువాత వరుస వివాదాలతో ఈ సినిమా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేశాకే శంకర్ తన కొత్త సినిమాను మొదలుపెట్టాలని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ కోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా ‘ఇండియన్ 2’ని పూర్తి చేసే వరకు శంకర్ కొత్త చిత్రం మొదలుపెట్టకుండా చూడాలని తెలుగు, హిందీ ఫిల్మ్‌ఛాంబర్స్‌కు లైకా ప్రొడక్షన్ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ రాంచరణ్, రణ్‌వీర్‌సింగ్ లతో సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆయా ఫిల్మ్‌ఛాంబర్స్‌కు లైకా ప్రొడక్షన్ లేఖ అందించినట్లు సమాచారం. చూడాలి మరి ఈసారి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post
మనీష్ ను పక్కన పెట్టడం పై వార్నర్ సంచలన వ్యాఖ్యలు…