telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఎం.వి. భాగ్య రెడ్డి వర్మ 135 వ జయంతిని పురస్కరించుకొని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నివాళులర్పించిన కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్

సంఘ సంస్కర్త ఎం.వి భాగ్య రెడ్డి వర్మ 135 వ జయంతి పురస్కరించుకొని సోమవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… అంటరాని కులాల ఉద్దరణ, దేవదాసి, జోగిని వంటి దురాచారాలను నిర్మూలనకు విశేష కృషి చేశారని కమిషనర్ తెలిపారు. హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాల స్థాపించి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు.

ఈ కార్యక్రమంలో  ఇ.వి.డి.ఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, అడిషనల్ కమిషనర్లు ప్రియాంక అలా, వి.కృష్ణ, సరోజ, విజయలక్ష్మి, జయరాజ్ కెన్నెడీ, పంకజా, సి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పద్మజా,  హెచ్.ఆర్.డి.సి.ఎల్ సి ఈ  సరోజ దేవి, చీఫ్ అకౌంట్స్ ఎగ్జామినర్ వెంకటేశ్వర రెడ్డి, ఏ ఎం సి రమణ, జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts