చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్వించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. బాబు జీవితం వెన్నుపోటు, శవరాజకీయాలకే సరిపోయిందని ఆమె ఫైర్ అయ్యారు. తిరుపతి ఎంపీ కరోనాతో మృతి చెందితే.. హడావిడిగా అభ్యర్థిని ప్రకటించి ఎప్పుడు ఎన్నికలు వస్తాయో అని ఎదురు చూస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎం పనిచేసిన చంద్రబాబు కరోనా సమయంలో ఏపీ ప్రజలకు ఎలాంటి భరోసా కల్పించారని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రజల గురించి ఆలోచించకుండా చంద్రబాబు చంద్రబాబు హైదరాబాద్ లో దాక్కున్నాడని ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఫండ్స్ రాకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని ఎన్నికలు పెడితే.. కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా పడేలా చేశారని.. ఇప్పుడేమో ఎన్నికలు పెట్టాలని స్టేట్ మెంట్స్ ఇస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని చంద్రబాబు మూడున్నర కోట్ల అప్పులో ముంచేశారని… రాష్ట్రంలో పదహారు నెలల కాలంలో నాలుగున్నర కోట్ల మంది ప్రజలకు సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందేలా చేశారని పేర్కొన్నారు.
previous post
“సాహో” కోసం ఎదురుచూస్తున్నాను… నారా లోకేష్