యువకుల ఉజ్వల భవితకు పునాది వేసుకునేందుకు రక్షణ దళాలు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తున్నాయి. టెన్త్ చదివి, వివిధ ప్రవేశ పరీక్షల ద్వారా ఎంపికైన వారిలో ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా చదివించి, ఉద్యోగం ఇస్తారు.. పది పూర్తిచేసిన వారిని, డిగ్రీ చదవిన వారిని ఉద్యోగంలోకి నేరుగా తీసుకుంటారు.. పోస్టులకు కోర్లుసకు ఎంపికైన వారుచిన్నవయసులోనే మంచి ఉద్యోగాలు పొందవచ్చు..చెఫ్ , స్టివార్ట్,హైజీనిస్: ఈ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ ప్రకటన విడుదల చేసింది.. ఈ ఉద్యోగాలకు పదోతరగతి అర్హత ఉంటే చాలు. దరాఖాస్తుచేసుకోవచ్చు.. రాత , దేహదారుఢ్య, వైద్యపరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు.. మొత్తం 400 పోస్టులు భర్తీ చేస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ప్రశ్నాపత్నం, ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.. ప్రశ్నాపత్రంలో రెండు విభాగాలు ంటాయి.. సైన్స్, మ్యాథమేటిక్స్ ఒక విభాగంలో, జనరల్ నాలెడ్జ్ మరోవిభాగంలో అడుగుతారు..
మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి.. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు తప్పుగా గురించిన ప్రతి సమాధానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.. అభ్యర్థులు రెండు సెకన్లలోనూ అర్హత సాధించటం తప్పనిసరి.. పరీక్ష వ్యవధి 30 నిముషాలు. సిలబస్, మాదిరి ప్రశ్నపత్రం ఇండియన్ నేవీ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. రాత పరీక్షలో అర్హత సాధించినవారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటిని పూర్తిచేసుకున్నవారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. అందులోనూ విజయవంతమైతే రాత పరీక్షలో చూపిన మెరిట్ ఆధారంగా తుది నియామకాలు చేపడతారు. ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహిస్తారు.