telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను కలిసిన ఎర్రబెల్లి..

Errabelli Trs

ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య 95వ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ విద్యా నగర్ లోని ఆయన ఇంట్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా ఆయనకు పాదాభివందనాలు చేసిన మంత్రి.. పాలకుర్తి నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి ని రామయ్య కు వివరించారు మంత్రి ఎర్రబెల్లి. అంతేకాదు..  చుక్కా రామయ్య ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు మంత్రి. తిరుమల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన శాలువాతో సత్కరించి, స్వీట్ బాక్స్ అందచేసిన మంత్రి… చుక్కా రామయ్య నిండుగా నూరేళ్ళు ఆయు, ఆరోగ్యాలతో జీవించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకాంక్షించారు. ఇదే సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని సత్కరించారు చుక్కా రామయ్య. అలాగే సీనియర్ పాత్రికేయులు, సంపాదకులు కే రామచంద్ర మూర్తి కూడా చుక్కా రామయ్య కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కే రామచంద్ర మూర్తి ని పలకరించి కాసేపు సమకాలీన అంశాల పై చర్చించారు మంత్రి ఎర్రబెల్లి.

Related posts