telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మ్యాచ్ అనంతరం హర్‌ప్రీత్‌ తో కోహ్లీ…

నిన్న రాయల్‌ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్ హ‌ర్‌ప్రీత్‌ మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. తన స్పిన్ మాయాజాలంతో ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(35), స్టార్‌ హిట్టర్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (0), ఏబీ డివిలియర్స్‌ (3)ను 7 బంతుల వ్యవధిలో ఔట్ చేసి పంజాబ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత బౌండరీ లైన్‌కి వెలుపల మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్‌తో హర్‌ప్రీత్‌ బ్రార్‌ మాట్లాడుతుండగా.. అక్కడికి వెళ్లిన విరాట్‌ కోహ్లీ అతడిని ప్రత్యేకంగా అభినందించాడు. నవ్వుతూ కరచాలనం చేసి హర్‌ప్రీత్‌ భుజం తట్టి ప్రోత్సహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. కోహ్లీ గొప్ప క్రీడాస్ఫూర్తి చాటాడు అంటూ నెటిజన్లు ఫిదా అయ్యారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ తీయాల‌ని క‌ల‌లు క‌నే బౌల‌ర్ లేడంటే అతిశ‌యోక్తి కాదు. అలాంటిది త‌న తొలి వికెటే కోహ్లీది అయితే ఆ బౌల‌ర్ ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. హ‌ర్‌ప్రీత్ బ్రార్ ఇప్పుడు అదే ఆనందంలో ఉన్నాడు.

Related posts