ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు వెల్లడి కాగా, 2,723 పోస్టులకు గాను, 58,007 మంది అర్హత సాధించారు. మొత్తం 64,575 మంది పరీక్షకు హాజరైన సంగతి తెలిసిందే. ఉత్తీర్ణులైన వారిలో 53,509 మంది పురుషులు, 4498 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు.
పురుషుల్లో ఒక్కో ఉద్యోగానికి 21 మంది పోటీ పడుతుంటే, మహిళల విషయానికి వస్తే, కొన్ని రిజర్వేషన్ కేటగిరీల్లో ఉన్న పోస్టుల కన్నా తక్కువ మంది అర్హత సాధించారు. అభ్యర్థుల మార్కుల వివరాలను పోలీసు నియామక మండలి వెబ్ సైట్ లో చూసి తెలుసుకోవచ్చని నియామక మండలి ఛైర్మన్ కుమార్ విశ్వజిత్ తెలిపారు.
ఆర్టికల్ 370 రద్దు పై స్పందించిన రాహుల్