telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

హాలీవుడ్ చిత్రానికి .. సమంత రివ్యూ .. జోక్విన్ నచ్చాడట..

samantha love on joaquin movie joker

హాలీవుడ్ చిత్రాలంటే నచ్చనివారు ఎవరు ఉంటారు. అయితే దానికి సెలెబ్రిటీలు కూడా అతీతం కదని టాలీవుడ్‌ అగ్రకథానాయిక సమంత హాలీవుడ్‌ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఇప్పటివరకూ తాను చూసిన చిత్రాల్లో ‘జోకర్‌’ చాలా గొప్ప సినిమా అని ఆమె పేర్కొన్నారు. హాలీవుడ్‌ నటుడు జోక్విన్‌ ఫినిక్స్‌ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘జోకర్‌’. డీసీ ఎంటర్‌టైన్‌మెంట్‌ తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా చూసిన సమంత సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. ‘నేను ఇప్పటి వరకూ చూసిన చిత్రాల్లో ‘జోకర్‌’ చాలా గొప్ప సినిమా. జోక్విన్‌లాగా మరొకరు ఉండరు’ అని సమంత ఇన్‌స్టా వేదికగా తెలిపారు.

ఈ ఏడాది విడుదలైన ‘మజిలీ’, ‘ఓ బేబి’ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు నటి సమంత. ప్రస్తుతం ఆమె తమిళంలో విజయవంతమైన ’96’ సినిమా తెలుగు రీమేక్‌లో బిజీగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మాతృకను తీసిన సి.ప్రేమ్‌ కుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

Related posts