ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా, దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాక్టరీలలో సుమారు 4805 అప్రంటీస్ పోస్తులని భర్తీ చేయనుంది. అయితే ఇందులో ఐటీఐ, 10th పాస్ అయిన వారు మాత్రమే అర్హులుగా పేర్కొంది. ఉద్యోగ సమాచారంలోకి వెళ్తే..
పోస్టుల సంఖ్య : 4805
ఐటీఐ అర్హత పోస్టులు – 3210
10 th అర్హత పోస్టులు – 1595
అర్హతలు : గుర్తింపు పొందిన ప్రభుత్వ రంగ ఐటీఐ బోర్డుల నుంచీ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి. దానితో పాటు 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. నాన్ ఐటీఐ అభ్యర్ధులు, తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. అలాగే సైన్స్,మ్యాధ్స్ లో తప్పనిసరిగా 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
వయస్సు : 15 నుంచీ 24 ఏళ్ళ మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్
ప్రారంభ తేదీ : డిసెంబర్ 20 -2019
మరిన్ని వివరాలకోసం : www.ofb.gov.in
———————————————————————–
48 ఖాళీల భర్తీకి యూపీఎస్‌సీ మరో నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ ఎగ్జామినర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని ఇప్పుడు భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 12, 2019. కాగా ఈ పోస్టుల దరఖాస్తు ఇప్పటికే ప్రారంభమయ్యింది.
కేంద్రం పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 48 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అందులో అసిస్టెంట్ రిజిస్ట్రార్- 11, సీనియర్ ఎగ్జామినర్- 10, అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాంకింగ్)- 3, అసిస్టెంట్ డైరెక్టర్ (క్యాపిటల్ మార్కెట్)- 1, ప్రిన్సిపల్ డిజైన్ ఆఫీసర్ (కన్‌స్ట్రక్షన్)- 4, సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1 (కన్‌స్ట్రక్షన్)- 4, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (డిజైన్)- 2, సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1 (ఎలక్ట్రికల్)- 6, డైరెక్టర్ (సేఫ్టీ)- 7 ఖాళీలు ఉన్నాయి.
అయితే ఈ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 12, కాగా ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.25. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది.
” అమ్మ ఒడి” ని ఓర్వలేక చంద్రబాబు దుష్ప్రచారం: రోజా