telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

రేపటి నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

rtc bus hyd

కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ విధించడంతో హైదరాబాదులోని సిటీ బస్సులు గత ఆరు నెలలుగా డిపోలకే పరిమితమైన సంగతి తెలిసిందే. దాదాపు 185 రోజుల తర్వాత నిన్న పాక్షికంగా సిటీ బస్సులు రోడ్డు మీదకు వచ్చాయి. అయితే నగర శివార్లలోని డిపోల నుంచి 229 బస్సులను అధికారులు తిప్పారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 3,200 బస్సులు ఉన్నాయి.

రేపటి నుంచి పూర్తి స్థాయిలో బస్సులు రోడ్డెక్కనున్నట్టు తెలుస్తోంది. కరోనా కారణంగా మార్చి 19న సిటీ, జిల్లా బస్సులు ఆగిపోయాయి.జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 29 డిపోలు ఉన్నాయి. వీటిలో శివార్లలో ఉన్న డిపోల నుంచి 15 కిలోమీటర్ల రేంజ్ లో నిన్న బస్సులు నగరంలో రోడ్డెక్కాయి.

Related posts