telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీ యువకుడికి కరోనా?.. అధికారులు అప్రమత్తం

karona virus case in canada found

హైదరాబాద్‌లో కలకలం రేపిన కరోనా వైరస్ ఇప్పుడు ఏపీలో కూడా వ్యాపించే అవకాశముందని అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని తూర్పుగోదావరి వాసులను కూడా ఈ వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. జిల్లాలోని కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఇటీవల అతడు దక్షిణ కొరియా వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. అనంతరం స్వగ్రామమైన వాడపాలేనికి చేరుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన హైదరాబాద్ అధికారులు, అతనికి కరోనా సోకిందేమోనన్న అనుమానంతో, అతడికి సంబంధించిన వివరాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన కలెక్టర్ జిల్లా అధికారులు, ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందించారు.

బాధితుడు స్వగ్రామం నుంచి తన అత్తగారి ఊరైన గోదశపాలెం వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. దీంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఈ వార్త కాస్తా వెలుగులోకి రావడంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, బాధితుడికి కరోనా వైరస్ సోకిందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Related posts