telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఆక్సిజన్‌ ప్లాంట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: జగన్‌

కరోనా నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం ఇవాళ జగన్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ నివారణా చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్‌సన్‌ట్రేటర్లు, డీ టైప్‌ సిలెండర్లు, ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు తదితర వాటి నిర్వహణకోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. దీని కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని.. పీహెచ్‌సీల్లో ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లు ఉంచాలని ఆదేశించారు.

జిల్లాల వారీగా వీటి నిర్వహణకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని.. ఏపీఎంఎస్‌ఐడీసీలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. 100 బెడ్లు ఉన్న ఆస్పత్రుల్లో ప్రాధాన్యతగా ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం జగన్.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రల్లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందుబాటులో ఉంచాలి అని అన్నారు. ప్లాంట్ల ఏర్పాటు ద్వారా వారికి 30శాతం సబ్సిడీ ఇస్తున్నామన్న సీఎం… కొత్త మెడికల్‌ కాలేజీల కోసం పెండింగ్‌లో ఉన్న భూ సేకరణను పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రేవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ కేటాయింపులు, తక్కువ వియోగంపై మారోమారు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు జగన్‌ స్పష్టం చేశారు.

Related posts