శ్రీరామనవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో స్పందించారు. రాముడి బాటలోనే ఐదేళ్లు సుపరిపాలన అందించామని అన్నారు. తెలుగు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టని శ్రీరామచంద్రుడే మనందరికీ మార్గదర్శి అని వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికల్లో ధర్మానిదే అంతిమ విజయం కాబోతోందనీ తెలిపారు. అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టబోతున్నారని బాబు ధీమా వ్యక్తం చేశారు. కష్టాలెన్ని ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టని శ్రీ రామచంద్రుడే మనకు మార్గదర్శి అని బాబు వ్యాఖ్యానించారు. లోక కల్యాణం కోసం ఆదర్శ పాలన సాగించిన శ్రీ రాముడి బాటలో ఐదేళ్లూ సుపరిపాలన సాగించాము. అభివృద్ధికే ప్రజల పట్టాభిషేకం అని ట్వీట్ చేశారు.
రాజధానిని మారుస్తామని బొత్స చెప్పలేదు: మంత్రి అవంతి శ్రీనివాస్