telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీపోలింగ్

OU students wrote letter to EC

ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అధికార టీడీపీ.. ప్రతిపక్ష వైసీపీ మధ్య చెలరేగిన ఘర్షణ రెండు చోట్ల పోలింగ్ పై ప్రభావం చూపడంతో ఎన్నికల సంఘం గుంటూరు జిల్లాలోని రెండు చోట్ల రీపోలింగ్ కు ఆదేశించింది. గూంటురు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ పోలింగ్ బూత్ తో పాటు నరసారావుపేటలోని 94వ పోలింగ్ బూత్ లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశించింది. గుంటూరు కలెక్టర్ నివేదిక ఆధారంగా ఈ రీపోలింగ్ కు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద గురువారం అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటలు ముగిసిన తర్వాత కూడా ఓటర్లు క్యూలైన్లో ఉండడంతో అధికారులు 300 వరకు స్లిప్పులు పంపిణీ చేశారు. ఇచ్చిన స్లిప్పుల కంటే ఓట్లు వేసిన వారి సంఖ్య అధికంగా ఉండడంతో ఆందోళనలు జరిగాయి. చివరకు రిటర్నింగ్ అధికారి రాత్రి 11.30 గంటలకు పోలింగ్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై ఈసీకి విన్నవించగా రీపోలింగ్ చేయాలని నిర్ణయించింది.

ఇక నరసారావుపేటలోని కేసానుపల్లి గ్రామంలోని 94వ బూత్ లో పీవో తప్పిదం వల్ల రీపోలింగ్ అనివార్యమైంది. బూత్ లో మాక్ పోలింగ్ సందర్భంగా 50 ఓట్లు వేశారు. వీవీ ప్యాట్ లో 50 స్లిప్ లను తొలగించారు. అయితే మాక్ పోలింగ్ తర్వాత ఓట్లను ఈవీఎంలలో తీసివేయలేదు. తనిఖీల్లో 50 ఓట్లు ఎక్కువ రావడంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించి రీపోలింగ్ కు ఆదేశాలిచ్చారు. దీంతో రెండు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ జరగనుంది.

Related posts