telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాత్రి పూట స్ట్రాంగ్‌రూమ్‌ నుండి ఈవీఎంల తరలింపు!

OU students wrote letter to EC

ఎన్నికలు పూర్తైన తర్వాత ఓటర్ల తీర్పు నిక్షిప్తమైన ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌ లలో భద్రపరిచారు. అయితే కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌ నుండి కొన్ని ఈవీఎంలను బయటకు తీసుకొచ్చారు. అయితే స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపర్చిన ఈవీఎంలు రిజర్వ్ ఈవీఎంలేనని అధికారులు చెబుతున్నారు. ఈవీఎంలను ఏ కారణంతో తెరవాలన్నా ఎన్నికల సంఘం అనుమతితో కలెక్టర్‌తోపాటు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే తెరవాల్సి ఉంటుంది.

శనివారం రాత్రి 10 గంటల సమయంలో కలెక్టర్, పార్టీల ప్రతినిధులు లేకుండా స్ట్రాంగ్ రూమ్‌ సీలు తీసి తలుపులు తెరిచి మూడు వాహనాల్లో ఈవీఎంలను తరలించడంపై వివాదాస్పదంగా మారింది. నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రిజర్వ్ ఈవీఎంలు ఆ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్, సబ్ కలెక్టర్ స్వపిన్ దినకర్ ఆధ్వర్యంలో తరలించినట్టుగా కలెక్టర్ ఇంతియాజ్ మీడియాకు వివరించారు. 103 రిజర్వ్ ఈవీఎంలను ఇతర రాష్ట్రాల్లో వినియోగించేందుకు వీలుగా తరలించినట్టుగా ఆయన వివరించారు. అన్ని పార్టీల ప్రతినిధులకు సమాచారం ఇచ్చినా కూడ ఈవీఎంల తరలింపు సమయంలో ఎవరు రాలేదని కలెక్టర్ వివరణ ఇచ్చారు.

Related posts