వరల్డ్ ఛాంపియన్‌షిప్ రెజ్లింగ్.. అమెరికాలో డబ్ల్యూడబ్ల్యూఈ తర్వాత అంత ప్రఖ్యాతిగాంచిన కార్యక్రమం. దీని ద్వారా ప్రపంచానికి పరిచయమైన మెక్సికోకు చెందిన రెజ్లర్.. తన మ్యాచ్ జరుగుతుండగానే ఆదివారం కన్నుమూశాడు. సిల్వర్ కింగ్‌గా ప్రపంచానికి తెలిసిన 51 ఏళ్ల సీజర్ బారన్.. తన చిరకాల ప్రత్యర్థి గురేరాతో పోరాడాడు. దీనిలో గురేరాను కిందపడేసి, తను కూడా కిందపడ్డాడు. రిఫరీ కౌంటింగ్ ప్రారంభించిన కాసేపటికి కదిలిన గురేరా.. లేచి నిలబడ్డాడు. కానీ సిల్వర్ కింగ్ లేవలేదు. అతను ఇంకా పడిపోయి ఉన్నాడనుకున్న గురేరా.. సిల్వర్ కింగ్‌ను ఓ తన్ను తన్ని నిలబడ్డాడు. అయినా అతనిలో కదలికలేదు. మళ్లీ కౌంటింగ్ ప్రారంభించిన రిఫరీ.. అది పూర్తికాగానే గురేరాను విజేతగా ప్రకటించాడు. ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతున్నారు. కానీ సిల్వర్ కింగ్‌లో చలనం లేదు. దీంతో ఆందోళన చెందిన తోటి రెజ్లర్లు, మెడికల్ సిబ్బంది సాయంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే గుండెపోటుతో సిల్వర్ కింగ్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
previous post